“దేవర” గ్లింప్స్ తో పాటు అది కూడా ..అభిమానులకి ఎన్టీఆర్ బిగ్ సర్ ప్రైజ్ ..!!

ఇది నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకా పక్కాగా ఊర మాస్ గా చెప్పాలి అంటే పిచ్చెక్కించే అప్డేట్ అని మాట్లాడుకోవాలి . ఎన్టీఆర్ దేవర సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 5 ఏప్రిల్ 2024 ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా దేవర నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ గ్లింప్స్ తేదీని అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం.

కొరటాల శివ ఈ గ్లింప్స్ ని అందరికి నచ్చేలా తెరకెక్కించాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమాకి డైరెక్షన్ ఎంత ఇంపార్టెంటో.. మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాదు గ్లింప్స్ కి ఆల్రెడీ ఒక మ్యూజిక్ రెడీ చేశారని.. ఇప్పుడు మరో రెండు మ్యూజిక్స్ ను అనిరుధ్ తయారు చేయబోతున్నాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు గ్లింప్స్ తో అభిమానులకు ఆకట్టుకోవడమే కాకుండా ఈ గ్లింప్స్ లో ఒక్క భారీ డైలాగు ను కూడా ఎన్టీఆర్ చేత చెప్పించబోతున్నాడట కొరటాల శివ . అంతే కాదు ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలపై ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు . వాటికి రఫ్పాడించే విధంగా ఆన్సర్ చెప్పే విధంగా ఒక డైలాగ్ చెప్పించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు..!!