నమ్రతతో ఆ రొమాంటిక్ సీన్ రీక్రియేట్..మహేశ్ బాబు మహా చిలిపి.. !!

మహేష్ బాబు.. ఏ పని చేసినా చాలా నాటీగా.. క్లీన్ గా పద్ధతిగా చేస్తూ ఉంటాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఈ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేశారు . ఆఫ్ కోర్స్ ఆయన ప్రతి డేని ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు . సంవత్సరంలో నాలుగైదు సార్లు అయినా ఫారిన్ టూర్ కి వెకేషన్ ని వేస్తూ ఫ్యామిలీతో సరదాగా గడిపే మహేష్ బాబు ఛాన్స్ దొరికితే టూర్లకి వెళ్లకుండా అసలు మిస్ చేయడు .

కాగా రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి మహేష్ బాబు దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేశారు . న్యూ ఇయర్ సందర్భంగా మహేష్ బాబు రేర్ పిక్ షేర్ చేశారు . నమ్రతను ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దాడుతున్న పిక్చర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ అయింది .

ప్రేమకు నిర్వచనం మీరే ఎప్పుడూ ఇలాగే ఉండండి అంటూ చాలామంది బ్లెస్ చేశారు. అయితే ఈ పిక్చర్ లో ఉండే సీన్ ఆయన నటించిన ఖలేజా సినిమాలోని సీన్ రీ క్రియేషన్ అంటూ ఫ్యాన్స్ సరదాగా ట్రెండ్ చేస్తున్నారు . ఖలేజా మూవీలో కూడా సేమ్ అనుష్కతో ఇలాగే ఒక సీన్ లో నటిస్తాడు . ఆమెను బుజ్జగించడానికి దగ్గర తీసుకొని ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు . సేమ్ ఇదే సీన్ ని మళ్లీ నమ్రతతో రీ క్రియేట్ చేశాడు మహేష్ బాబు. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!