తల్లి, కూతురు కలిసి ఆ టాలీవుడ్ స్టార్ హీరోని టార్గెట్.. సిగ్గు లేదా అంటూ ఫుల్ గా ఏకేస్తున్న ప్రేక్షకులు..!

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట రచ్చ చేస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంటారు సురేఖ వాణి మరియు తన కూతురు సుప్రీత. నిత్యం తన అప్డేట్స్ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈమె తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరికీ కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

ఏ విషయం చెప్పాలన్న బోల్డ్ పిక్స్ తో ఆ విషయాన్ని వెల్లడిస్తారు ఈ బ్యూటీస్. ఇక సురేఖ వాణి తన కూతురిని టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే పేరు ఉన్న హీరోల సరసున‌ నటిస్తే ఆమె కూతురికి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతాయని భావించింది. చిన్న హీరో సరసున నటిస్తే తన కూతురికి పెద్దగా కెరీర్ ఉండదేమోనని.. చిన్న సినిమాలలో నటించనివ్వడం లేదు సురేఖ వాణి. ఇక తాజాగా సురేఖ వాణి తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఈ క్రమంలోనే తన సినిమా ఎంట్రీ పై స్పందించింది. త్వరలోనే తన సినీ ఎంట్రీ ఉంటుందని చెప్పకనే చెప్పింది. దీంతో సుప్రీత అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఆమె అభిమానులు. టాలీవుడ్ స్టార్ హీరో సరసున సుప్రీతాని హీరోయిన్గా పరిచయం చేయాలని సురేఖవాణి గట్టి ప్రయత్నాలు చేస్తుంది.‌ తల్లి ,కూతుర్లు కలిసి ఆ స్టార్ హీరోని ఇబ్బంది పెడుతున్నారు కూడా అట. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.