వెంకీ ” సైంధవ్ ” మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఇవే..!

వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.‌ ఇక వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా 75వ మూవీగా తెరకెక్కింది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ్ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ తదితరులు కీలక పాత్రలలో పోషించారు.

అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. పండగ సెలవలను కూడా ఈ మూవీ వాడుకోలేకపోయింది. ఇక ఈ మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం. ఈ మూవీకి రూ. 24.7 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది.

ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 25 కోట్ల షేర్లు రాబట్టాలి. పది రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ. 10.53 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ. 14.47 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా లాంగ్ రన్ లో వసూళ్లు సాధించేటట్టు కనిపించడం లేదు. ఇక ఇవే ఆఖరి వసూళ్లు అని చెప్పొచ్చు.