హనుమాన్ సినిమా క్లైమాక్స్ రాగానే ..ఈ మహిళ చేసిన పనికి అంతా షాక్.. జనాలు పరుగో పరుగు(వీడియో)..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హనుమాన్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వైరల్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు దాటిపోతున్న సరే ఇంకా థియేటర్లో హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫీవర్ తగ్గలేదు . చాలామంది జనాలు ఫ్యామిలీతో ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ నెలకొల్పింది హనుమాన్ సినిమా.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది . ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతూనే ఉంది . కాగా రీసెంట్గా హైదరాబాద్లోని ఓ థియేటర్లో హనుమాన్ సినిమా చూస్తున్న మూమెంట్లో సినిమా క్లైమాక్స్ లోకి రాగానే ఓ మహిళ బిహేవ్ చేసిన పద్ధతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అమ్మవారు పూనిన్నట్టు థియేటర్లలో సీట్లో నుంచి ఊగుతూ అరుపులతో జనాలను టెన్షన్ పెట్టేసింది ఆ మహిళ. కొంతమంది అమ్మవారు పునారు అంటుంటే.. మరి కొంతమంది ఆమెకు హెల్త్ కండిషన్ బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ట్యాగ్ చేస్తున్నారు కొందరు జనాలు..!!