“కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంది అందుకే”.. శ్రీజ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

శ్రీజ.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురుగా ఆల్రెడీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది . సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తన కి సంబంధించిన విషయాలను అభిమానులతో చెప్పుకు వస్తూనే ఉంటుంది . అయితే శ్రీజ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు విడాకులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ కి గురి చేశారు ఆకతాయిలు.

శ్రీజ కు పెళ్లిళ్లు సెట్ అవ్వవని.. దారుణంగా మాట్లాడారు . అంతేకాదు కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ పై కూడా ట్రోల్స్ చేశారు . రీసెంట్గా వాటికి సమాధానం చెప్పింది శ్రీజ . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కళ్యాణ్ దేవ్ తో విడాకులపై పరోక్షంగా స్పందించింది. “నేను మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నాను .. ఒంటరిగానే బతుకుతున్నాను. నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది నాతోపాటు నా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేశారు.”

“నన్ను నా కుటుంబాన్ని బాగా బ్లేమ్ చేశారు . అది చూసి బాగా ఏడ్చాను. మానసికంగా బాధపడ్డాను. ఒక్కటి ఆలోచించండి ఎవరు కూడా విడాకులు తీసుకోవాలి అని పెళ్లి చేసుకోరు కదా ..? మా అమ్మ మా నాన్న లాగా ఎవరు చూసుకోతు.. అంత ప్రేమగా నన్ను చూసుకోరు.. మా నాన్నకి నేనంటే చాలా చాలా ఇష్టం ప్రాణం “అంటూ ఎమోషనల్ గా స్పందించింది శ్రీజ. పరోక్షకంగా కళ్యాణ్ దేవ్ తో తాను హ్యాపీగా లేను అన్న కారణంగానే విడాకులు తీసుకున్నట్లు చెప్పకనే చెప్పేసింది అంటున్నారు అభిమానులు..!!