సూర్య-జ్యోతిక విడాకుల్లో బిగ్ ట్విస్ట్.. జనాలకి ఊహించని షాక్(వీడియో)..!!

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు రోజుకి వందలు వేళల్లోనే అలా తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో మనం చూసాం . 2006లో గ్రాండ్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు .

ఫ్యామిలీ పరంగా సినిమా పరంగా సూర్య – జ్యోతిక ఎవరికి అందనంత టాప్ పొజిషన్లో ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత జ్యోతిక మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బాలీవుడ్ లోనూ బడా బడా సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. రీసెంట్గా బాలీవుడ్ సినిమాల్లో అవకాశం రావడంతో సినిమా షూటింగ్ కోసం ముంబైకి మకాం మార్చింది.

అంతే సూర్యకి జ్యోతికకు మధ్య మేటర్ చెడింది అని వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కొన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన సూర్య జ్యోతిక ఈ వార్తలు ఎక్కువైపోవడంతో ఫైనల్లీ రిప్లై ఇచ్చారు. మేము మా బిజీ షెడ్యూల్ కారణంగానే దూరంగా ఉన్నాము అని విడాకులు తీసుకోవట్లేదు అని క్లారిటీ ఇచ్చారు . రీసెంట్గా జ్యోతిక తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది . ఫిన్లాండ్లోని మంచులో సూర్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది . వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్గా ఉన్న ఫొటోస్ కూడా షేర్ చేసింది . దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు . హమ్మయ్య ఆల్ హ్యాపీస్ సూర్య జ్యోతిక విడిపోవడం లేదు అంటూ ప్రశాంతంగా ఉన్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)