ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ మూవీ రాజా సాబ్‌. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత.. మొదటిసారి కామెడీ టైమింగ్ తో.. లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్‌లో చాలా చిల్‌గా కనిపించాడు. అయితే ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక ప్రస్తుతం ప్రభాస్ వ‌రుస‌ సినిమాల్లో నటిస్తూ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఆడియోస్ ను అలరిస్తున్నాడు. గతేడాది ఆదిపురుష్‌, స‌లార్‌ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కి 2898 ఏడి సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీనితో పాటు రాజా సాబ్‌ కూడా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.