అలాంటి సినిమాల్లో నటించడం నా వల్ల అసలు కాదు.. హీరోయిన్ తాప్సి కామెంట్స్ వైరల్..

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను. తర్వాత రవితేజ , గోపీచంద్, ప్రభాస్, వెంకటేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల్లో సరస‌న‌ నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల్లో అలరిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగానే బాగా పాపులారిటీ దక్కించుకుంది. తన మొదటి సినిమా పింక్ తో భారీ పాపులాటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్క‌డ‌ వరుస ఆఫర్లను అందుకుంటుంది.

ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయాలంటే ఫస్ట్ తాప్సినే గుర్తుకొచ్చేంత రేంజ్ లో ఆమె సక్సెస్ సాధించింది. బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంటూ కూడా తాప్సి టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా ఢంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తరచూ తాప్సి సోషల్ మీడియాలో గ్లామర్ డోర్స్ పెంచుతూ కొర్ర కారును ఆకట్టుకుంటుంది. కాగా తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూల సందడి చేసింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా యానిమల్ సినిమా ప్ర‌స్తావ‌న‌రాగా ఆమె మాట్లాడుతూ అలాంటి సినిమాల్లో నేనైతే నటించలేను.. ఇతర నటి,నటీమణులను వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. మనది స్వతంత్ర దేశం. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండవచ్చు. ఎవరికి నచ్చిన కంటెంట్ వారు ఎంపిక చేసుకొని సినిమాలు తీయవచ్చు. యాక్టర్స్ ఎవరికైనా సరే వారి జీవితంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలా రెస్పాన్సిబులిటీస్‌ని గౌరవిస్తూ నేను ముందుకు వెళుతున్నా. వ్యక్తిగతంగా మాత్రం నేను అలాంటి సినిమాల్లో నటించను అంటూ తాప్సి వివరించింది. ప్రస్తుతం తాప్సి తెగేసి మరి ఈ విషయాన్ని చెప్పడంతో సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.