అయిపోయింది అంతా అయిపోయింది.. కొంప ముంచేసిన శ్రీ లీల ..అందరూ అనుకున్నంత పని చేసేసిందిగా..!

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల లోకం.. మాయా ప్రపంచం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు అని ఇప్పటికే చాలా చాలా మంది సినీ ప్రముఖులు ..సినీ పెద్దలు స్టార్ సెలబ్రిటీస్ చెప్పుకొచ్చారు . అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ జనరేషన్ మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు . క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ చూసుకొని మేమే తోపులం అంటూ విర్రవీగుతూ ఉంటారు .

వన్స్ నాలుగు సినిమాలు ఫ్లాపులు పడ్డాయా ఇక అడ్రస్ లేకుండా పోతారు. ప్రెసెంట్ అలాంటి టఫ్ సిచువేషన్ ఫేస్ చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది హీరోయిన్ శ్రీ లీల . పెళ్లి సందడి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తూ ఉండడమే ఇందుకు కారణం.

శ్రీ లీల తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసినప్పటికీ .. టాక్ పరంగా నెగిటివ్ క్రియేట్ చేసుకుంది . అంతకుముందు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ సినిమాలకు కూడా భారీ దెబ్బేశాయి. దీంతో శ్రీ లీల సినిమాలకు బ్రేక్ చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . ఫైనల్లీ అదే నిజమైంది శ్రీలీల సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పేస్తుంది . తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కి కథ వినకుండానే వెనక్కి తిరిగి పంపించేస్తుందట. దీంతో శ్రీ లీల బ్రేక్ తీసుకుంటుంది అన్న వార్త నిజం అయిపోయింది..!!