ఒక్క నిర్ణయంతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న సమంత.. చూసి చూసి సెంటర్లోనే కొట్టిందిగా..!

సమంత ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే ఒక పేరు . అది మంచి కానీ చెడు కానీ సమంత పేరు లేనిదే అక్కడ ట్రెండ్ అవ్వదు.  అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొనేసింది . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టేసుకుందనే చెప్పాలి.  ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ ఆరు ఎనిమిది హిట్లు అందుకొని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది .

నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం.  అయితే రీసెంట్ గా హీరోయిన్ సమంత సినిమాలకు దూరం కాబోతుంది అని ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తుంది అని కొత్త నటీనటులతో సినిమాలను  నిర్మించబోతుంది అని వార్తలు వినిపించాయి.  కాగా రీసెంట్గా సమంత తీసుకున్న బోల్డ్ డెసిషన్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది.

ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాలి అని అనుకోవడం లేదట . సినిమాల్లో నటిస్తూనే సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతుందట.  త్వరలోనే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యతో ఓ కొత్త సినిమాను నిర్మించబోతుందట . అదేవిధంగా బాలీవుడ్లో కమిట్ అయిన సిటాడిల్ కాకుండా రెండు సినిమాలను కమిట్ అయిందట . హాలీవుడ్ లోనూ ఒక సినిమాకి కమిట్ అయిందట.  తెలుగులో తప్పిస్తే మిగతా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయడానికి కమిట్మెంట్ తీసేసుకుంటుంది సమంత.  దీంతో ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!