బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 నుంచి క్రేజీ ఫోటో లీక్.. పట్టు చీరలో ఏమున్నాడు రా బాబు మన బన్నీ..!!

ప్రెసెంట్ కోట్లాదిమంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమాలలో ఒకటి పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ నటిస్తున్నాడు . ఈ సినిమా పుష్ప 1 కి సీక్వెల్ గా రాబోతుంది. పుష్పవన్ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి హిట్ అందుకుందో మనకు బాగా తెలుసు.

సినీ చరిత్రను తిరగరాసింది . ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది . అయితే ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ప్రజెంట్ ఈ సినిమా షూట్ సర వేగంగా జరుగుతుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇక్కడ నుంచే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక క్రేజీ పిక్ లీక్ అయి వైరల్ అవుతుంది.

బన్నీ పట్టుచీర కట్టుకొని ఉన్న ఒక పిక్చర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పిక్చర్ లో బన్నీ చాలా ట్రెడిషనల్ గా అమ్మవారి లుక్ లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ పుష్ప2ట్టు సినిమాలో తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి కొన్ని సీన్స్ ఉండబోతున్నాయి అంటూ సుకుమార్ ప్రకటించాడు . ఇప్పుడు ఆ జాతర సీన్స్ కు సంబంధించి కొన్ని సీన్స్ రీ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ పట్టుచీరలో బన్నీ కనిపించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!