నేలపై నడిచే స్వర్గధామం.. అల్లు అర్జున్ వ్యానిటీ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియన్ లెవెల్‌లో పాపులారిటి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్లో బిజీగా ఉండే అల్లు అర్జున్.. ఇంట్లో కంటే అతని కేరవ్యాన్ లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. అయితే బన్నీకి మొదటి నుంచి ఆటోమొబైల్స్ అంటే చాలా ఇంట్ర‌స్ట్ అని టాక్‌. ఇక బ‌న్ని గ్యారేజ్ ను ఒకసారి చూస్తే అందరికీ ఈ విషయం క్లారిటీ వస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ వై, జాగ్వార్ ఎక్స్ జె ఎల్ లాంటి సూపర్ మోడల్ లగ్జరీ కార్లన్నీ అల్లు అర్జున్ గ్యారేజ్ లో కనిపిస్తాయి. ఇవన్నీ ఒక ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ అయితే మరో లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు.

సింపుల్గా చెప్పాలంటే చక్రాల మీద.. నేలపై నడిచే స్వర్గధామంలా అనిపిస్తుంది. అంత విలాసవంతంగా ఉండే ఈ వ్యానిటీ వ్యాన్ ధ‌ర‌, దాని స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ షూటింగ్ టైంలో ఉండే క్యారవాన్ ధర అక్షరాల రూ.7 కోట్లని సమాచారం. సాధారణంగా అల్లు అర్జున్ బ్లాక్ కలర్ ఇష్టపడ్డతాడ‌ట‌. అందుకే ఈ వ్యానిటీ వాన్ కారును పూర్తిగా బ్లాక్‌క‌ల‌ర్‌లో డిజైన్ చేయించాడని చెప్తూ ఉంటారు. ఇక ఈ వ్యానిటీ వ్యాన్ మొత్తం అధునాతన ఫ్యూచర్లతో నిండి ఉంటుంది.

లివింగ్ ఏరియా, ప్రీమియం లాంజ్, విశాలమైన బెడ్రూమ్, స్పెషల్ మేకప్ రూమ్, పెద్ద టీవీ సెట్, ఫ్రిడ్జ్ ఇలా అన్ని రకాల ఆధునిక టెక్నాలజీలతో తన వ్యాన్ డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. అప్పుడప్పుడు తన వ్యానిటీ వ్యాన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ షేర్ చేసుకుంటూ ఉంటాడు. అ వ్యానిటీ వాన్ కు ఫాల్కన్ అనే పేరు పెట్టి అది తనకు ఎంతో స్పెషల్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు.