మరో తెలుగు సినిమా చేయబోతున్న రణబీర్ కపూర్.. డైరెక్టర్ ఎవరంటే..?

రన్బీర్ కపూర్ ..నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరకే ఈ పేరు మారు మ్రోగిపోయింది . ఎప్పుడైతే యానిమల్ సినిమా ద్వారా ఆయన తెలుగు జనాలకు పరిచయమయ్యారో..అప్పటినుంచి రన్బీర్ కపూర్ పేరు తెలుగు మీడియాలో సైతం హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనం చూసాం.

900 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత రన్బీర్ కపూర్ ఎలాంటి సినిమాలు చూస్ చేసుకుంటాడు అని అందరికీ ఆత్రుతగా ఉంది . అయితే రన్బీర్ కపూర్ మరో పాన్ ఇండియా సినిమాను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ ఓ క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేశారట. పుష్ప సినిమా తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట.

సుకుమార్ ఆ తర్వాత రామ్ చరణ్తో సినిమాకు కమిట్ అవ్వబోతున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా తన భార్య అలియా భట్ నే తీసుకోబోతున్నారట మేకర్స్. దీంతో ఈ ప్రాజెక్టుపై మరింత హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందో..??