బిగ్ షాకింగ్: శతమానం భవతి సీక్వెల్ లో హీరో శర్వానంద్ కాదా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శర్వానంద్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచిన శతమానం భవతి కి సీక్వెల్ రాబోతుందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన సూపర్ అని చెప్పాలి . వేరే లెవెల్ ..మరి ఏ హీరో చేసిన కూడా ఇంత బాగా నటించి ఉండేవాడు కాదేమో ..

సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ఇష్టంగా నిర్మించాడు . రెండు బడా సినిమాలు కాంపిటీషన్ కి వచ్చినా సరే ధైర్యంగా ఈ సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు . ఈ సినిమా అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. తల్లిదండ్రుల ప్రేమ – పెద్దల కోసం తమ ప్రేమను వదులుకునే అద్భుతమైన జంట . అచ్చ తెలుగు సంక్రాంతికి మరో అర్థం వచ్చేలా ఈ సినిమాను డైరెక్టర్ చేశారు .

2017లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. మళ్లీ ఇన్నేళ్లకి ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సీక్వెల్లో హీరోగా మాత్రం శర్వానంద్ నటించడం లేదట. దీంతో అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. శర్వా లాంటి హీరో ఉండగా మరో కొత్త హీరో ఎందుకు అంటూ మండిపడుతున్నారు. హీరోయిన్గా కూడా అనుపమ పరమేశ్వరన్ కాకుండా యంగ్ బ్యూటీ శ్రీ లీలను చూస్ చేసుకుంటున్నారట . దీంతో ఫాన్స్ మరింత స్థాయిలో ఫైర్ అయిపోతున్నారు..!