వామ్మో.. ఈ నందమూరి హీరోయిన్ బాగా ముద్దిరిపోయిందే.. డైరెక్ట్ గా పెద్ద తలకాయకే గురి పెట్టేసింది..!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము అన్నది కాదు మన మాటలతో మెస్మరైజ్ చేసి అవకాశాలు పట్టామా లేదా అదే ఇంపార్టెంట్ . ప్రెసెంట్ ఇదే ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు ముద్దు గుమ్మలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో పాగ వేసుకుంటున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువ అయిపోతుంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది ఆశికా రంగన్నాథ్ . నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాలో నటించి క్రేజీ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆశిక… నందమూరి హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకునింది .

అంతేకాదు ప్రెజెంట్ నాగార్జున “నా స్వామి రంగా” సినిమాలో కూడా నటించి త్వరలోనే తన పర్ఫామెన్స్ ను అభిమానులకు చూపించబోతుంది . కాగా ఈ క్రమంలోనే ఆశిక రంగనాథ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి నువ్వు రేంజ్ లో పొగిడేసింది . “ఆయన చాలా పద్ధతిగా సినిమాలు తెరకెక్కిస్తాడని .. ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమాలోనైనా నటించాలనుకుంటున్నాను అని ఓపెన్ గా చెప్పుకొచ్చింది”. అఫ్కోర్స్ చాలామంది హీరోయిన్స్ ఇలా చెబుతారు కానీ ఆశికా చెప్పిన తీరు మాట విధానం అభిమానులకి బాగా నచ్చింది .

అందుకే ప్రత్యేకంగా రాజమౌళికి సజెస్ట్ చేస్తున్నారు . ఈ హీరోయిన్ తో ఒక సినిమా తీసేయ్ జక్కన్న అంటూ సపోర్ట్ చేస్తున్నారు. అంతే కాదు కొంతమంది ఈమె ఏకంగా పెద్ద తలకాయకి గురి పెట్టింది అని ..రాజమౌళి సినిమాలో హీరోయిన్గా నటించి హిట్ కొడితే ఆమె కు అవకాశాలు క్యూ కట్టుకొని వస్తాయని బాగా గ్రహించింది అంటున్నారు . చూద్దాం మరి ఈ అమ్మడు బిస్కెట్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో..?? ప్రజెంట్ రాజమౌళి పై ఆశికా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!