పడగడుపున అరటిపండు తినవచ్చా? తినకూడద?.. క్లారిటీ..!

అరటి పండ్లు చాలామంది తింటూ ఉంటారు. వీటిని కొంతమంది ఉదయం మరి కొంతమంది సాయంత్రం ఇలా ఒక్కో సమయంలో తింటూ ఉంటారు. అరటిపండు లో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలను అందిస్తుంది. చాలామంది ఖాళీ కడుపుతో అరటిపండును తింటుంటారు.

కానీ పరగడుపున అరటిపండు తినకూడదంటున్నారు కొందరు నిపుణులు. షుగర్ పేషెంట్లు కాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పొద్దున్నే అరటిపండు తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి జీర్ణం సమస్యలు సైతం కలుగుతాయి. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే రక్తంలో మెగ్నీషియం లెవెల్ పెరుగుతుంది.

అలానే రక్తంలో క్యాల్షియం, మెగ్నీషియం సమతుల్లత దెబ్బతిని గుండెకు ముప్ప ఏర్పడుతుంది. అరటిపండును భోజనం తర్వాత తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. పచ్చి అరటిపండును తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇక మన ఆరోగ్యాన్ని ఉదయాన్నే అరటి పండుని తిని డేంజర్ జోన్ లో పెట్టుకోకండి. అందువల్ల ఎప్పుడైనా పడగడుపున అరటిపండు తినవద్దు.