సినీ చరిత్రను తిరగ రాసిన మహేశ్ బాబు.. కేవలం ఆడవాళ్లకి మాత్రమే “గుంటూరు కారం” ప్రత్యేక షోలు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సరికొత్త చరిత్ర క్రియేట్ చేయబోతుందా..?? అంటే ఎస్ అన్న టాక్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే ఇప్పటికి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పలు థియేటర్స్ వద్ద గుంటూరు కారం హడావిడి నెలకొంది . కేవలం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి.

 

అంతేకాదు ఈ సినిమాని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు . వాళ్ళు కూడా ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలి అనుకుంటారు. కానీ ఆ క్రౌడ్ కి అబ్బాయిల మధ్య చూడలేరు . ఇక అలాంటి లేడీ ఫ్యాన్స్ కి నమ్రత గుడ్ న్యూస్ వినిపించింది . వారికోసం ఓ స్పెషల్ షో వేయిస్తున్నారట . కేవలం లేడీస్ కి మాత్రం ఆ షో పడబోతుందట.

ఈ విషయం తెలియజేస్తూ నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . విజయవాడ గాంధీనగర్ లోని రాజ్ థియేటర్లో ఈ స్పెషల్ షో ని నమ్రత ఏర్పాటు చేశారు. రాజ్ థియేటర్లో గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో కేవలం మహిళలకు మాత్రం పడబోతుంది . మహేష్ బాబు సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి అంటే ఎంత అదృష్టం ఉండాలో మనకు తెలిసిందే. మరి అలాంటి అదృష్టాన్ని ఏ మహేష్ బాబు ఫ్యాన్ వదులుకుంటారు చెప్పండి..??? అందుకే మహేష్ బాబు అభిమానులు నమ్రతకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు!

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)