“రేయ్..ఓరేయ్.. ఇది మరీ టూ మచ్ గా ఉంది రా బాబు”.. ఫ్యాన్స్ పై మహేశ్ పోస్ట్ వైరల్..!!

గుంటూరు కారం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. మహేష్ బాబు నటించిన సినిమా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది . సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండడంతో థియేటర్స్ వద్ద భారీ హంగామా నెలకొంది. అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు “మీరే మా అమ్మానాన్న” అంటూ ఎమోషనల్ అవ్వడం ..

శ్రీలీలను ఓ రేంజ్ లో పొగిడేయడం ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు ఈ స్పీచ్ ని ఎండ్ చేయడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు . కొంతమంది ఏకంగా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా రెండు రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని .. త్వరలోనే గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి అని ఓ రేంజ్ లో పొగిడెస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు కూడా అభిమానులను ఉద్దేశిస్తూ ..గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన గుంటూరు జనాలను ఉద్దేశిస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు . “మీ ప్రేమకి అభిమానానికి చాలా రుణపడి ఉంటాను ..కచ్చితంగా త్వరలోనే మళ్లీ కలుద్దాం “అంటూ పోస్ట్ చేశారు . అంటే దీని అర్థం మహేష్ బాబు కూడా గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని గుంటూరులోనే చేయాలని డిసైడ్ అయ్యారు అనేగా ..ఈ విధంగా హింట్ ఇచ్చేసావా మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరి రేయ్ ఇది మరీ టూ మచ్ అంటూ రిప్లై ఇస్తున్నారు..!!