శోభన్ బాబు మళ్లీ పుట్టాడా.. ఆరడుగుల కట్ అవుట్ తో సోగ్గాడి వీడియో వైరల్..

గత కొంతకాలం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్ తెగ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రష్మిక, దీపిక, కాజోల్, అలియా భట్.. ఇలా చాలామంది ఏఐ వీడియోస్ నెట్టింట‌ చెక్కర్లు కొట్టాయి. అలాగే చిన్నారులు పక్షుల వాతావరణం.. దేవుళ్ళు ఇలా చాలా వరకు ఏఐ ఫొటోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగం తో పాటు ప్రమాదం కూడా అంతే ఉంటుందంటూ వాదన‌లు కూడా వినిపించాయి.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఏఐ వీడియోస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వీడియో చూస్తే నిజమేనా అనే భ్ర‌మ అందరిలోనూ కలుగుతుంది. అంతగా ఈ వీడియోస్ ప్రజలను గందరగోడానికి గురిచేస్తున్నాయి. తాజాగా దివంగత హీరో శోభన్ బాబు వీడియో సోష‌ల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఆంధ్రుల సోగ్గాడు, అందగాడు దివంగత నట్లు శోభన్ బాబుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. శోభన్ బాబే మళ్ళీ పుట్టాడా అనేంత ఎఫెక్టీవ్‌గా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సహాయంతో ఈ వీడియోని రూపొందించారు.

సముద్రం ఒడ్డున శోభన్ బాబు చాలా స్టైలిష్ గా రాయల్‌లుక్‌లో నడుస్తూ వస్తున్నట్లు అనిపించింది. ఈ వీడియోలో శోభన్ బాబు కట్ అవుట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. శోభన్ బాబు ముఖాన్ని ఆ విధంగా క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే చక్కర్లు కొడుతుండగా.. సోగ్గాడు మళ్ళీ ఇన్స్టా యుగంలో జన్మిస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడంటూ కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక టాలీవుడ్‌లో ఒకప్పుడు శోభన్ బాబుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.