సీనియ‌ర్ ఎన్టీఆర్‌, కె విశ్వ‌నాధ్ మ‌ధ్య అంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా.. ఏకంగా అని సంవ‌త్ప‌రాలు మాట‌డుకోలేదా..?!

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఎంతోమంది తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ గారికి దివంగత నటుడు నటసార్వభౌమ ఎన్టీఆర్ గారికి మధ్యన గొడవ కారణంగా వీరిద్దరూ 14 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్, కె.విశ్వనాథ్ కు విభేదాలు రావడానికి అసలు కారణం అదేనా! | Telugu Rajyam

అయితే ఇంతకీ ఎన్టీఆర్, విశ్వనాధ్ గారికి మధ్య గొడవ ఏంటి.. ఎందుకు మాట్లాడుకోలేదు.. ఓసారి చూద్దాం. వీరిద్దరూ కాలేజీ చదివే రోజుల్లో ఎన్టీఆర్.. విశ్వనాధ్ గారికి సీనియరట‌. అల వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఉండేది. ఎన్టీఆర్ చదువు పూర్తి అయిన వెంటనే సినిమాల్లోకి వచ్చారు. విశ్వనాథ్ గారు కూడా తన చదివిన పూర్తి చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇలా వీరిద్దరి మధ్యన ఉన్న ఉన్న ఆ బందంతో వీరిద్ద‌రి కాంబోలో ప‌లు సినిమాలు కూడా తెర‌కెక్కాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా చిన్ననాటి స్నేహితులు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్ కి, విశ్వనాథ్ గారికి మధ్య మనస్పర్ధలు వ‌చ్చాయట.

K. Viswanath - Wikipedia

ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకొని లోకేషన్ కి వస్తే అది సెంటిమెంట్ సీన్ కావడంతో సన్ గ్లాసెస్ బాగుండవని తీసేయమని విశ్వనాధ్ చెప్పారట. అయినా ఎన్టీఆర్ అదే సన్ గ్లాసెస్ తో నటించారట. ఇలా ఈ సన్నివేశం షూటింగ్ టైంలో ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన విషయంలో ఎన్టీఆర్.. విశ్వనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. డబ్బుకు లోకం దాసోహం అనే సినిమా కంటే ముందు విశ్వనాధ్ దర్శకత్వం వహించాల్సిన ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉండగా.. ఆ సినిమా నుంచి విశ్వనాథ్‌ తొలగించి యోగానంద్‌ను డైరెక్టర్గా తీసుకున్నాడట ఎన్టీఆర్. ఇలా ఈ గొడవలు కారణంగా వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడి 14 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని.. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమి మూవీ షూటింగ్ టైంలో వీరిద్దరూ తిరిగి మాట్లాడుతున్నారని టాక్.