నాలుక రంగును బ‌ట్టి ఎవ‌రికి ఏ జ‌బ్బు ఉందో తెలిసిపోతుందా.. ఆ టెక్నిక్ ఇదే..!

మన జీవన విధానంలో నాలుకపై పెద్దగా శ్రద్ధ పెట్టడం. కానీ ఏదైనా జబ్బు కోసం డాక్టర్ దగ్గరికి వెళితే మాత్రం వైద్యకులు ముందుగా చూసేది నాలుక. నాలుకను చూడటం ద్వారా కాలేయం వంటి అనేక వ్యాధుల లక్షణాలు కనిపిస్తాయట. అందుకే వైద్యులు సైతం నాలుక రంగును బట్టి శరీర ఆరోగ్యాన్ని చెబుతారు. వేడి వేడి టీ లేదా కాఫీ తాగితే నాలుక మండుతుంది.

అదేవిధంగా చల్లని పదార్థం నాలుక మీద పెట్టిన అసౌకర్యంగా అనిపిస్తుంది. నోటిలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే నాలుకపై తెల్లటి పూత వస్తుంది. నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే శరీరంలో తగినంత నీటి శాతం లేకపోయినా నాలుక తెల్లగా మారుతుంది.

శరీరంలో పోషకాహార లోపం ఉన్నట్లయితే నాలుకపై అనేక లక్షణాలు వ్యక్తం అవుతాయి. నాలుక ఎర్రగా అయితే మన శరీరంలో విటమిన్లు లేవని అర్థం. ఇక మన శరీరంలో విటమిన్ బి లోపం ఉన్నట్లయితే.. నాలుక ఎర్రగా కనిపిస్తుంది. ఇలా మీ నాలుక బట్టి మీ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోని మీ నాలుకను చాలా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.