ఆ ఒక్క ప్రశ్న అడగ్గానే తలదించేసిన రష్మిక.. పాపం ఇక ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాకి సంబంధించిన టాక్ ..పోస్టర్స్.. పాజిటివ్ కామెంట్స్ ..నెగిటివ్ కామెంట్స్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటించిన నటన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. కేవలం బాలీవుడ్ జనాలే కాదు టాలీవుడ్ ప్రముఖులు సైతం రన్బీర్ కపూర్ నటనకు మంచి మార్కులు ఇస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నా పాత్రపై చాలా బోల్డ్ గా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు రష్మిక మందన్నా అంటే కేవలం లిప్ లాక్ సీన్స్ వరకే అని అనుకునేవారు. కానీ సందీప్ రెడ్డివంగా చూపించిన తీరు ఆమెలోని బోల్డ్ యాంగిల్ ను బయటపెట్టింది . ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో ఆమె నటించినంత బోల్డ్ గా.. మరి ఏ హీరోయిన్ కూడా ఇంతకు తెగించలేదు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే ఇదే విషయం కారణంగా రష్మిక మందన్నా రిలేటివ్స్ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయట . అంతేకాదు రష్మిక మందన్నా ఫ్రెండ్స్ కూడా ఆమెకు కాల్ చేసి ఇంత బోల్డ్ గా ఎలా నటించగలిగావు రష్మిక అంటూ ప్రశ్నిస్తున్నారట . అంతేకాదు ఆమె చెల్లి కూడా రష్మికను నిలదీయడంతో ఆమె ముఖం ఎత్తుకోలేక తలదించుకొని మరి సైలెంట్ గా వెళ్ళిపోయిందట . రిలేటివ్స్ దగ్గర నుంచి ఈ వార్త లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే కామెంట్స్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!