“నాకు పెళ్లి అయ్యింది.. నాకు ఆ కోరిక ఉంటుందిగా..అర్ధం చేసుకోండి”..పాపం ఆ విషయంలో నితిన్ ఎంత బాధపడుతున్నాడో..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మీడియా సమావేశంలో నాటీ నాటీగా ఆన్సర్ ఇస్తూ ఉంటారు . కానీ కొంతమంది మాత్రం చాలా పద్ధతిగా ఎదుటి వాళ్ళు విసిగించేలా ప్రశ్నలు వేసిన చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు . ఆలిస్ట్ లోకే వస్తాడు హీరో నితిన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ ప్రెసిడెంట్ హిట్లు లేక అల్లాడిపోతున్నాడు . తన ఆశలు అన్ని త్వరలో రిలీజ్ కాబోతున్న ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమాపై పెట్టుకొని ఉన్నారు.

సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలా నటిస్తుంది . అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేశారు. ” ఓలే ఓలే పాపాయి” అంటూ సాగే ఈ పాట ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటుంది . కాగా మీడియా ప్రతినిధుల అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు నితిన్ .

ఈ క్రమంలోనే సుధాకర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఓ జర్నలిస్ట్ ..”నితిన్ కు మీరు రెమ్యూనరేషన్ ఇచ్చారా..? సినిమా రిలీజ్ చేశాక ఇస్తారా..?” అంటూ ప్రశ్నించారు. దీనికి సుధాకర్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తాను అంటూ సమాధానం చెబుతాడు . వెంటనే తండ్రి దగ్గర నుంచి మైక్ లాక్కున్న నితిన్..” ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది.. నాకు ఖర్చులుంటాయి ..నాకు డబ్బులు అవసరం ఉంటుంది ..నాకు ఇప్పుడే కావాలి ..నేను బాగా ఎదగాలి కదా ” అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి నవ్వించేస్తాడు . దీంతో నితిన్ పరిస్థితి అర్థం చేసుకోండి సార్ అంటూ నితిన్ ఫాన్స్ కూడా సుధాకర్ రెడ్డిని ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు..!!