మ‌రో కంటెస్టెంట్‌ను బ‌లి చేసిన ద‌త్త‌పుత్రిక‌… పాపం డాక్ట‌ర్ బాబు…!

బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తంగా సాగుతుంది. గతవారం డబల్ ఎలిమినేషన్ జరగగా… ఈవారం నామినేషన్స్ లో అమర్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. ఇక గత వారంలో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈవారం ఫినాలే అస్త్ర టాస్క్‌ లు ఎంతో రసవత్తంగా సాగాయి. ఇక ఈ ఫినాలే అస్త్రన్ని అర్జున్ గెలుచుకున్నాడు.

ఇక ఈ వారం ఓటింగ్ టైం పూర్తికాగా.. ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అర్జున్ ” ఫినాలే అస్త్ర ” సొంతం చేసుకోవడంతో ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవడంతో పాటు మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇక మొదట ప్రశాంత్, శివాజీ సేఫ్ అవ్వగా.. తర్వాత యావర్, ప్రియాంక అయినట్లు తెలుస్తుంది.

ఇక అనంతరం శోభా శెట్టి, గౌతమ్ డేంజర్ జోన్లో ఉండడంతో.. పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న..” ఎవిక్షన్ పాస్ ” తో శోభాను సేవ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో గౌతమ్ ఈవారం ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఏదేమైనా శోభాను బిగ్ బాస్ బాగానే కాపాడుతుందని చెప్పాలి. బిగ్బాస్ కి శోభ ఒక దత్తపుత్రిక. ఇంకెన్ని రోజులు సేవ్ చేస్తాడో చూద్దాం మరి.