ర‌వితేజ ‘ ఈగిల్ ‘ సూప‌ర్ హాట్ కేకు… డీల్ క్లోజ్‌…!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమస్త పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిఛొట్ల గ్రాండ్గా నిర్మిస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దవ్ జంద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని ముఖ్య మ్యూజిక్ ఐకాన్ మ్యూజిక్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు.

ఇక అతి త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు. రవితేజ పవర్ఫుల్ రోల్‌ లో కనిపించనున్న ఈ సినిమా లో మధుబాల, అవసరాల శ్రీనివాస్, నవదీప్ కీలక పాత్రలలో పోషించనున్నారు.