‘ స‌లార్ ‘ ట్రైల‌ర్‌లో మిస్టేక్‌లు… కొత్త ట్రైల‌ర్ చూశారా… ( వీడియో)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కేవలం రెండు నిమిషాలలోనే.. భారీ రికార్డును నెలకొల్పింది.

ఇక ఈ ట్రైలర్ లో మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలామందికి గూస్ బంప్స్ సైతం వచ్చాయి. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే మాస్ సినిమా కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

అదేంటంటే.. మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని డైలాగ్స్ విషయంలో ఆడియన్స్ ఇష్యూ రైజ్ చేశారు. దీంతో మేకర్స్ ఈ ట్రైలర్ ని మార్పులు చేర్పులు చేసి అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సబ్ టైటిల్స్ ని కూడా మార్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ కొత్త అప్డేటెడ్ ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈనెల డిసెంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానుంది.