త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మృణాల్ ఠాగూర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌..

స్టార్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. తర్వాత తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్ గా వచ్చిన హిందీ మూవీలో హీరోయిన్గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. అలా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌ సీతామహాలక్ష్మి గా, ఫ్రిన్స్ నూర్జహాన్‌గా సీతారామం మూవీతో కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది.

హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మృణాల్‌ ఖాతాలో మరో సక్సెస్ పడింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే మృణాల్‌ ఠాగూర్ పెళ్లి గురించి గత కొంతకాలంగా న్యూస్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. న్యూ జెర్సీలో విజయ్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అక్కడ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

మృణాల్‌ మాట్లాడుతూ ఆయన నాకు ఎంతో స్పెషల్ అని.. ఈ మూవీలో సమయమా, అమ్మాడి సాంగ్స్ నాకు చాలా ఇష్టం అంటూ వివరించింది. తన ఫస్ట్ మూవీ నుంచి తెలుగు ఆడియో సాంగ్ ఎంతో ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. కీగా ఇంతలో అక్కడున్న ఓ పిల్లోడు మీకు పెళ్లయిందా అంటూ ప్రశ్నించాడు. దాంతో ఆమె నవ్వుతో త్వరలోనే పెళ్లి చేసుకుంటా అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం మృణాల్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.