” హాయ్ నాన్న ” మూవీలో శృతిహాసన్ రోల్‌ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. దరిద్రమంతా ఈమె చుట్టూనే ఉందిగా..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా… మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా… శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ” హాయ్ నాన్న ” ఈ సినిమా నిన్న (డిసెంబర్ 7 ) థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాని యాక్టింగ్ కి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో నాని చాలా కూల్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపించాడు.

ఇక ఈ సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఎమోషన్ ప్రేక్షకులని కంటతడి పెట్టించింది. ఇక ఈ మూవీలో శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పాత్ర చిన్నదే అయినప్పటికీ అభిమానులని బాగా ఆకట్టుకుంది శృతి. అయితే ఈ పాత్ర కోసం ఫస్ట్ మరో హీరోయిన్ ని అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్. కానీ ఆ స్టార్ హీరోయిన్ ఈ పాత్రని రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు రష్మిక మందన.

ఇక ఈమె ఈ సినిమాని రిజెక్ట్ చేయడమే కాకుండా.. ఈ మూవీపై అసభ్యకరమైన కామెంట్లు చేసింది. ఇంత చిన్న పాత్రలో నటిస్తే తన క్రేజ్ తగ్గుతుందని భావించిన ఈమె.. ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ వద్ద మాత్రం అది బిస్కెట్ క్యారెక్టర్.. అది సినిమాకి అసలు హైలెట్ అవ్వదు అంటూ చీప్ గా మాట్లాడిందట రష్మిక. ఇక ఈమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు.. ఈమెపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.