నాపై వచ్చిన ఆ న్యూస్ లో నిజం లేదు.. అది చూసి నేను ఏడ్చేసా.. హన్సిక

అల్లు అర్జున్ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంటర్ ఇచ్చింది హన్సిక మోత్వాన్ని. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హన్సిక ఊహించినట్టుగానే మంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ సినిమాలతో తన క్రేజీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో చిన్నా చిత్కా హీరోల సరసన కూడా సినిమాల్లో నటించింది.

ఇక తర్వాత మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైనా ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్‌ల‌లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే గ‌త‌ కొంతకాలంగా హన్సికపై పలు న్యూస్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీస్ పై ఇలాంటి పుకార్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొంతమంది పాజిటివ్ వార్తలను రాస్తే.. మరి కొంతమంది నెగటివ్ న్యూస్‌లను వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో స్వయంగా ఆ సినీ సెలబ్రిటీలే స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం హన్సికకి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది.

ఆమె 16 ఏళ్ళ వయసులోనే హార్మోన్ ఇంజక్షన్లు తీసుకుని అప్పట్లో అంత అందంగా కనిపించిందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికీ వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్ల పై ఇటీవల హన్సిక స్పందించింది. నాపై వచ్చినవన్నీ రూమర్స్ అని.. అలాంటి ఇంజక్షన్‌లేవి నేను తీసుకోలేదు.. ఆ తప్పుడు వార్తలను నమ్మవద్దు అంటే క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు వైరల్ అవ్వడంతో మా అమ్మ చాలా బాధపడిందని ఆమెను చూసి నేను ఏడ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే స్వతంత్రం ఉంటుంది.. కానీ మరొకరి పర్సనల్ విషయాల గురించి నోటికి వచ్చినట్లు అవాస్తవాలు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ వివరించింది.