కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” మూవీ సరికొత్త రిలీజ్ డేట్..!!

నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక బింబిసారా సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక తాజాగా ఈయన నటిస్తున్న మూవీ ” డెవిల్ “.

పిరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న డెవిల్ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో అభిషేక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

డిసెంబర్ 29న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తున్నట్లు అభిషేక్ అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… నందమూరి ఫ్యాన్స్.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. అంటూ భరోసా ఇస్తున్నారు.