సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సిటాడల్ ‘ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సమయంలో నాగ‌ చైతన్యతో ప్రేమలో పడి కొద్ది సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్ళి మూడునాళ్ళ‌ ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక చైతుతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడింది. ఓ పక్కన ఆ వ్యాదికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరో పక్కన పలు సినిమాల్లో నటించింది.

ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించి సక్సెస్ అందుకున్న సమంత.. సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ను కూడా పూర్తి చేసుకుని యాక్టింగ్‌కు వన్ ఇయర్ బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చినా పలు బ్రాండ్స్ సోషల్ మీడియా వేదికపై ప్రమోట్ చేస్తూ సంపాదిస్తుంది. ఇక సెటాడెల్‌ సిరీస్ షూటింగ్ పూర్తై ఇంతకాలమైనా ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ కూడా ఫిక్స్ అయిపోయిన ఇప్పటివరకు స్ట్రీమింగ్ కాకపోవడంతో ఇక ఈ సిరీస్ రాదేమో అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

దీంతో నెట్టింట సిటాడైల్ వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడు అంటూ నెటిజన్స్ నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. తాజాగా ఈ సిటాడెల్‌ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కి సంబంధించిన ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతుందంటూ తెలుస్తుంది. రాజ్ అండ్‌ డీకే డైరెక్షన్లో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ఈ సిరీస్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏప్రెల్ 24న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియదు గానీ సమంత నుంచి ఎటువంటి మూవీ అప్డేట్స్ రాకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ మరికొద్ది రోజుల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుందన్న న్యూస్ వైరల్ అవ్వడంతో పండగ చేసుకుంటున్నారు. అయితే గతంలో ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఓటిటి ప్లాట్ఫామ్ లోకి అడుగుపెట్టిన సమంత.. ఈ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సిరీస్‌లో రాజీ అనే ఓ నెగటివ్ స్టేడ్స్‌ ఉన్న అమ్మాయిలా నటించి విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకున్నా సామ్‌.. ఈ సిరీస్‌లో ఎలాంటి పాత్రలో నటించిందో.. ఆమె ఈ సిరీస్ తో సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.