” హాయ్ నాన్న ” మూవీ లిప్‌కిస్ పై నాని సెన్సేషనల్ కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..?!

నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది ప్రారంభంలో ” దసరా ” సినిమాతో ఎంత పెద్ద హిట్ దక్కించుకున్నాడు మనందరికీ తెలిసిందే. కేవలం నటన పరంగానే కాకుండా.. బాక్స్ ఆఫీస్ పరంగా కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెవిన్యూ వచ్చింది. ఇక అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాని నటించిన లేటెస్ట్ సినిమా ” హాయ్ నాన్న “. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శౌర్యవ్ దర్శకత్వం వహించాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో నాని చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో నాని, మృణాల్ ఠాకూర్ కలిసి పండించిన రొమాన్స్ అండ్ లిప్ లాక్ సన్నివేశాల గురించి రిపోర్టర్లు ప్రశ్నలు అడిగారు.

దీనికి నాని సమాధానం చెబుతూ…” లిప్ లాక్ సన్నివేశంలో నటించడం వల్ల తప్పేముంది. ఈమధ్య కాలంలో లిప్ లాక్ అనగానే ఏదో నేరం చేసినట్లు మమ్మల్ని చూపిస్తున్నారు. అదే బయట పబ్బుల్లో, పార్టీలలో చేస్తే తప్పు కాదు. మన చుట్టూ జరిగేవి వెండితెర మీద చూపిస్తుంటే ఎందుకు అభ్యంతరంగా చూస్తున్నారు ” అంటూ నాని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.