“హాయ్ నాన్న” ఫస్ట్ డే కలెక్షన్స్ : నాని కెరీర్ లోనే చెత్త వసూళ్లు.. కేవలం సింగిల్ డిజిట్..!!

పాపం తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన నాని హాయ్ నాన్న సినిమా పరమ చెత్త కలెక్షన్స్ సాధించింది . మొదటి రోజే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోగా ..కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసే వసూలు సాధిస్తుంది అని అంతా అనుకున్నారు . అయితే నాని కెరియర్ లోనే పరమ చెత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది .

కేవలం సింగిల్ డిజిట్ నెంబర్ తోనే సరి పెట్టేసుకొనింది. 6.10 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరియర్ను బాగా దెబ్బేసింది. అంతకు ముందు రిలీజ్ అయిన దసరా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే . టాక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ హాయ్ నాన్న కలెక్షన్స్ పరంగా ఎందుకు ఫ్లాప్ అయింది ..? అనే విషయాలు చర్చించుకుంటున్నారు అభిమానులు . అయితే సినిమా రిలీజ్ అయ్యే నాలుగు రోజులు ముందే తెలంగాణలో ఎలక్షన్స్ కౌంటింగ్ పూర్తి అవ్వడం ..

ఆ తర్వాత తుఫాను కారణంగా ఏపీలో అల్లకల్లోల పరిస్థితి నెలకొనడంతో హాయ్ నాన్న సినిమా బాగా లాస్ తెచ్చుకుంది అంటున్నారు జనాలు . అంతేకాదు ఈ సినిమాలో పెద్దగా కాన్సెప్ట్ లేకపోవడం కేవలం ఎమోషన్ సెంటిమెంట్ డ్రామా కావడంతో ఫ్యామిలీ తప్పిస్తే మిగతా జనాలు చూడడానికి ఇష్టపడడం లేదు . ఆ కారణంగానే ఈ సినిమాకు ఇంత పరమ చెత్త కలెక్షన్స్ వచ్చాయి అంటున్నారు జనాలు..!!