వరద బాధితులకు సాయం అందించిన నయన్.. సహాయం చేసిన విమర్శలు తప్పడం లేదుగా..?!

మిచౌంగ్ తుఫాను ప్రభావం తమిళనాడులో.. చెన్నైతో పాటు శివారు ప్రాంతాలకు కూడా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షం తగ్గిన ఇంకా చాలా చోట్ల అలానే నీరుండిపోయి వరద ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. చాలా ప్రదేశాల్లో ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో నిత్యవసరాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సాయక సామాగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా లోటు తీరడం లేదు.

ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్న ఇప్పటికీ చాలా చోట్ల సాధారణ ప్రజల ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో వేల‌లో జనం కనీస అవసరాలు తీరక సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీంతో పలువురు స్వచ్ఛంద సేవకులు, సినీ సెలబ్రిటీలు సాయం చేసేందుకు వారంత‌ట వారే ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విజయ్, సూర్య, విశాల్ హీరోల ఫ్యాన్స్ వాలంటీర్లుగా తమ వంతు సహాయ అందించారు. ఈ నేపథ్యంలో నయనతార కూడా ఈ వరద బాధితులకు తన చేయూతను అందించేందుకు ముందుకు వచ్చింది.

புதிய தொழில் தொடங்கிய Nayanthara 💕 Vignesh shivan | Femi9 - YouTube

తన బిజినెస్ బ్రాండ్ అయినా ఫెమి 9 ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు. దుస్తులు, ఆహారం, సానిటరీ నాప్కిన్లు, వాటర్ బాటిల్స్, మెడిసిన్స్, పాలు లాంటివి అందించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్ తో పాటు చాలామంది జనల ప్ర‌శంస‌లు అందాయి. అయితే కొంతమంది మాత్రం ఎప్పుడూ తప్పుడు కామెంట్స్ చేయడానికి ముందుంటారు. ఇక నయనతార సహాయం విషయంలో కూడా వారు తప్పులను వెతుకుతూ ఆమె ఫెమి 9 వ్యాన్ ద్వారా సహాయం అందించడం అంత అవసరమా.. ఇలాంటి సమయంలో కూడా బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటూ సహాయం అందించాలా అంటూ విమర్శిస్తున్నారు.

Nayanthara : చెన్నై వరద బాధితులకు నయనతార సాయం.. విమర్శలు చేస్తున్న  నెటిజన్స్.. - NTV Telugu

అయితే ఆమెను సపోర్ట్ చేసే చాలామంది ఆమె కంపెనీకి చెందిన కాస్మెటిక్ వాహనం ద్వారా ట్రాన్స్ఫర్ట్‌ చేస్తుంటారు. ప్రజలకు సాయం చేసేందుకు అందులో సామాన్లు ఖాళీ చేసి ప్రజలకు అవసరమైన సామాగ్రిని తీసుకురావడం కూడా తప్పేనా.. అంద‌రీకంటే తన కంపెనీలో ఉన్న డ్రైవర్లు అయితే ఆ పనిని కరెక్టుగా చేస్తారని ఆమె భావించి ఉండవచ్చు.. ఇలాంటి సహాయం చేసే విషయంలో కూడా తప్పులను వెతుకుతూ.. చీప్ గా మాట్లాడకండి అంటూ ఫైర్ అవుతున్నారు.