” RRR మూవీ ప్రమోషన్స్ టైం లో చరణ్ నన్ను అలా చూశాడు “.. ఆలియా భట్ సెన్సేషనల్ కామెంట్స్…!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకమైన పరిచయం లేదు. అవసరం అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. వీరిద్దరు కూడా కెరీర్పరంగా అద్భుతమైన సక్సెస్ను అందుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నటించినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా, చరణ్ ని బేభత్సంగా పొగిడేసింది. ఈమె మాట్లాడుతూ… ” ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ టైం లో నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నాడు. ఎక్కడున్నాను ఎలా ఉన్నాను.. కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నానా? లేదా? అని చెక్ చేసేవాడు.

ఈరోజు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా మిగిలాడు. ఒక యాక్టర్ గా, పర్సనల్గా అతను చాలా గొప్పోడు. ఏదైనా ఒక సీన్ చేసేముందు అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తాడు. ఎలాంటి ఓవరాక్షన్ లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు ” అంటూ చెప్పుకొచ్చింది ఆలియా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.