బుక్ మై షోలో ” హనుమాన్ ” మూవీ హవ.. స్టార్ హీరోల సినిమాలకి కూడా ఇంత రెస్పాన్స్ రాదేమో..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా మనందరికీ సుపరిచితమే. ఓహ్ జేజి , అద్భుతం వంటి సినిమాలతో ఆడియన్స్ కి పరిచయమైన తేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ హ్యాండ్సం హీరో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నటువంటి ” హనుమాన్ ” మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

HanuMan (Hanu Man) - Telugu Movie Review, Ott, Release Date, Trailer,  Budget, Box Office & News - FilmiBeat

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ బుక్ మై షో లో 150+ ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 12 ,2024న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వినయ్ రాయ్ ఈ మూవీలో మైఖేల్ అనే విలన్ పాత్రలో నటించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకున్నాయి.