తెగించేసిన రామ్ చరణ్.. ఆ డైరెక్టర్ కి ఫేస్ టూ ఫేస్ వార్నింగ్..ఏమైందంటే..?

వామ్మో.. ఏంటి రామ్ చరణ్ కి అంత కోపం వచ్చేసిందా? ఏకంగా తెలుగు డైరెక్టర్ కి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చేసాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జనరల్ గా రాంచరణ్ చాలా సాఫ్ట్ . ఎవరి జోలికి వెళ్ళడు .. తన జోలికి వచ్చిన పెద్దగా పట్టించుకోడు . అలాంటి రామ్ చరణ్ కి కోపం వచ్చేసింది. అందుకే ఏకంగా డైరెక్టర్ కి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చేసారట .

ఆ డైరెక్టర్ మరెవరో కాదు బింబిసారా డైరెక్టర్ వశిష్ట. కళ్యాణ్రామ్ కు బింబిసారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వశిష్ట ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా సోషియో ఫాంటసీ గా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారు అంటూ సరికొత్త న్యూస్ కూడా వైరల్ అవుతుంది.

అయితే ఈ సినిమాలో చాలా చాలా డీప్ యాక్షన్ సీన్స్ ఉంటాయట . ఏజ్ గల చిరంజీవి అన్ని యాక్షన్ సీన్స్ చేయడం కష్టం . అందుకే రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ అన్నిటిని డూప్ పెట్టి తెరకెక్కించమన్నారట చరణ్. కానీ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదట ..నేనే చేస్తాను అంటూ మొండి పట్టుదల పట్టారట. దీంతో చరణ్ అంత ఏజ్ గల ఆయన అలాంటి షాట్స్ చేస్తే ప్రమాదమని ఆయన ఇలాంటి షాట్స్ లో నటిస్తే సినిమానే ఆపేస్తామంటూ వశిష్టకు స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు వశిష్ట కూడా..” వద్దు సార్ డూప్ పెట్టి మానేజ్ చేద్దామన్న చిరంజీవి వినట్లేదట”. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!