రష్మిక లైఫ్ లో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే.. విజయ్ దేవరకొండకు మించిన ముఖ్యమైన రోజు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా నేషనల్ క్రష్ అనగానే అందరికీ టక్కున గుర్తుచేది రష్మిక మందన్నా. పేరుకి కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది . ఎంతలా అంటే ఆమె పేరు చెప్తే బాలీవుడ్ జనాలు పడి చచ్చిపోయే ..అంతలా తెలుగు తమిళ్లో బాగా సినిమా అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్గా స్టేటస్ సంపాదించుకున్నాక బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక..

రీసెంట్గా యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి చెమటలు పట్టించేసింది . ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ మరి ఏ హీరోయిన్ నటించలేదని చెప్పాలి. అయితే డిసెంబర్ 30 రష్మికకు చాలా చాలా స్పెషల్ . ఆమె కిర్రాక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . డిసెంబర్ 30నే రిలీజ్ కావడం గమనార్హం. 2016 డిసెంబర్ 30 ఆమె నటించిన కిర్రాక్ పార్టీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

ఈ సినిమా ఆమెకు మంచి లైఫ్ ఇచ్చింది. ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి . అందుకే ఆమెకి ఈరోజు చాలా చాలా స్పెషల్. కాగా హీరో విజయ్ దేవరకొండ కి రష్మిక కు మధ్య ఏదో ఉంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అవి అంత ఫేక్ అంటున్నారు జనాలు..!!