రేణు దేశాయ్ కు కొడుకు అకీరా అద్దిరిపోయే స్పెషల్ సర్ప్రైజ్.. హార్ట్ టచ్చింగ్ గిఫ్ట్(Video)..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ రేణు దేశాయ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత ఆమె పేరు ఓ స్థాయిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పలువురు జనాలు ఆయనను ట్రోల్ చేస్తుంటే .. మరి కొందరు ఆమెను ట్రెండ్ చేస్తున్నారు . అయితే తన కూతురు – కొడుకు మాత్రం ఆమెకు సంబంధించిన ప్రతి మూమెంట్ను ఎంజాయ్ చేస్తున్నారు .

రీసెంట్గా రేణు దేశాయ్ తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు కొడుకు అకీరా ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అందరినీ ఆకట్టుకునింది . అందరిలాగా నెక్లెస్ లు, ఇయర్ రింగులు ,డైమండ్ రింగ్స్ గిఫ్ట్ చేయకుండా తన టాలెంట్ తో అమ్మ కోసం ఓ స్పెషల్ వీడియోని ఎడిట్ చేశాడు . జానీ సినిమాలోని రేణు దేశాయ్ వి కొన్ని సీన్స్ కట్ చేసి సప్త సాగరాలు దాటి సినిమాలోని ఓ సాంగ్ ఎడిట్ చేసి వీడియో రూపొందించాడు .

ఈ సాంగ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది . ఇందులో పవన్ కళ్యాణ్ షాట్స్ కూడా ఉండడం గమనార్హం. ఈ వీడియోని రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా బర్త డే కి నా కొడుకు గిఫ్ట్ అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఫ్యాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ షాట్స్ లో రేణూ దేశాయ్ చాలా క్యూట్ గా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు..!!

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)