టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి-అల్లు అర్జున్ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి బావ బామ్మర్దిగా ఉంటూనే మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉండేవారు.. ముఖ్యంగా చిరంజీవికి సంబంధించి ఎలాంటి విషయాలు నైనా దగ్గరుండి అల్లు అరవింద్ చూసుకునేవారు.. అంతగా ఉన్న..వీరు ఈ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు గత కొన్నెలుగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలసి ప్రతి ఈవెంట్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ చేసే ఏ ఈవెంట్ కి కూడా చిరంజీవిని పిలవడం లేదు.
అల్లు అర్జున్ కు కూడా మెగా ట్యాగ్ తీసేసి అల్లు ఆర్మీ అని ఒక ట్యాగ్ ను సైతం తగిలించుకోవడంతో వీరిద్దరి మధ్య కచ్చితంగా గొడవలు ఉన్నాయని వాటికి ఉదాహరణగా మారిపోతోంది. మెగా కుటుంబంలో ఉన్న హీరోలు అందరూ కూడా టాలెంటెడ్ హీరోలు మంచి క్రేజీ ఉంది. కానీ అల్లు అరవింద్ మాత్రం చిరంజీవిని బాగా ఉపయోగించుకుని డబ్బులు బాగానే సంపాదించుకున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నది.. గతంలో చిరంజీవి చేసిన సినిమాలకు నిర్మాతగా ఉండి భారీగానే సంపాదించారట.
అలా డబ్బులు బాగా సంపాదిస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ కు కూడా స్టార్ డం రావడంతో పాటు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా సక్సెస్ కావడంతో చిరంజీవిని పక్కకి పెట్టేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అల్లు అరవింద్ తన కొడుకు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు.. ప్రస్తుతం అల్లు కుటుంబం అనే బ్రాండ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే అల్లు అరవింద్ తన అవసరం తీరాక చిరంజీవిని పక్కకు నెట్టేసినట్టుగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.