బ్రీత్ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్యన ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

నందమూరి తారక రామారావు పెద్ద తనయుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ళ‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వంశీకృష్ణ రక్షా, జక్క‌న లాంటి సినిమాలను రూపొందించాడు. ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ కృష్ణ చాలా గ్యాప్ త‌ర్వాత‌ ఇప్పుడు చైతన్య కృష్ణ హీరోగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అందుకోకపోతే వంశీకృష్ణ కూడా డైరెక్టర్ గా కొనసాగడం కష్టమే. అయితే ఈ సినిమాకు జయకృష్ణ.. బసవతారక రామ్‌ బ్యానర్ పై ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ మూవీలో చైతన్య కృష్ణ ఓ డిసెంట్ రోల్లో కనిపించబోతున్నాడట. ఇక గతంలో చైతన్య కృష్ణ ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఆయనకి ఆ మూవీలతో అంతగా గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం బ్రీత్ అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు కృష్ణ చైతన్య. ఇక ఈ సినిమాలో చైతన్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొడతారు అంటూ చైతన్య కృష్ణకు బూస్టప్‌ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే చైతన్య కృష్ణ కూడా వరుస అవకాశాలను అందుకునే అవకాశం ఉంది.

ఇక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఎటువంటి సినిమాలు వచ్చిన హీరోతో సంబంధం లేకుండా కథ బాగుంటే హెడ్ కొట్టడం ఖాయం. అందువల్ల హీరో ఎలా ఉన్నా కూడా సస్పెన్స్ థ్రిల‌ర్‌ సినిమాలు ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే బ్రీత్ సినిమా చేయడం వెనక కృష్ణ చైతన్య ఓ క‌థ ఉందంటూ వివ‌రించాడు. అదేంటంటే వాళ్ళ తాత ఎన్టీఆర్ పేరు నిలబెట్టడానికి ఒక మంచి కథ దొరికితే సినిమా చేయాలని ఉద్దేశంతో కృష్ణ చైతన్య చాలా ప్రయత్నించాడట. అయితే అలాంటి కథ కోసం చాలా రోజులుగా ప్రయత్నించాడట. అలాంటి టైంలో బ్రీత్ స్టోరీ తగలడంతో ఇదే పర్ఫెక్ట్ స్టోరీ అనిపించి ఈ సినిమాను నటించాను అంటూ తెలియజేశాడు కృష్ణ చైతన్య.