బాలీవుడ్ ఎంట్రికి సిద్ధమైన రవితేజ.. ఏ మూవీలో అంటే..

టాలీవుడ్ హీరో రవితేజ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మాస్ మహారాజుగా క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న రవితేజ.. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమా తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడు మాస్ మ‌హ‌రాజా. ఈ సినిమా క్రాక్ సినిమాకు సీక్వల్ గా ఉంటుందంటూ న్యూస్లు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకువేచి చూడాలి. అయితే ఇప్పటికే గోపీచంద్ మల్లినేని – రవితేజ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రవితేజ ఈ సినిమా తరువాత బాలీవుడ్ ప్రాజెక్టులో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఓ మూవీలో లీడ్ క్యారెక్టర్ లో రవితేజ నటించబోతున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటికే డైరెక్టర్ రవితేజను కలిసి కథ చెప్పాడంటూ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ రవితేజ బాలీవుడ్ మూవీ లో ఎంట్రీ ఇస్తే బాలీవుడ్ లో కూడా ఆయనకు మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. ఇక గతంలో పాన్ ఇండియా లెవెల్ లో టైగర్ నాగేశ్వరావు వచ్చినప్పటికీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్ లో ఊహించిన రేంజ్‌లో రవితేజ సక్సెస్ అందుకోలేదు. అయినా రవితేజ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు.