సాయిధరమ్ తేజ్‌ను బుర్ర తక్కువ వెధవ అన్న నెటిజన్.. త‌న స్టైల్‌లో రిప్లై తో ఇచ్చిప‌డేసిన‌ తేజ్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతంలో వచ్చిన విరూపాక్ష సినిమాతో భారీ హీట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గాంజయ్‌ శంకర్ మూవీలో నటిస్తున్న సాయి ధ‌ర‌మ్‌ తేజ్ చివరిగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కూడా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాడు సాయిధరమ్ తేజ్. ఇక నిన్నటితో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీ లోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. పిల్ల నువ్వు లేని జీవితం మూవీతో తేజ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఇక ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయినా సందర్భంగా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ ఏర్పాటు చేశాడు. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పాడు. కొందరు నెటిజన్స్ చేసిన తలతిక్కల కామెంట్స్ కు తనదైన స్టైల్ లో రిప్లై తో ఇచ్చిప‌డేసాడు. అందులో భాగంగా తేజ్‌ను ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్రలు ఏంటి అని అడగగా.. తేజ్ చిత్రాలహరి, రిపబ్లిక్ ఈ రెండు సినిమాల్లో నాకు నా రోల్ చాలా సంతృప్తిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. అందులో రిపబ్లిక్ స్పెల్లింగ్ తప్పు పడడంతో ఓ నెటిజ‌న్‌ కొద్దిగా ఘాటుగా కామెంట్ చేశాడు.

అది రిలబ్లిక్ కాదురా బుర్ర తక్కువ వెధవ ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళావా అని రాసుకొచ్చాడు. అందుకు సాయి ధరమ్ తేజ్ తనదైన స్టైల్ లో స్పందించాడు. నువ్వు చెప్పింది కరెక్టే.. మా స్కూల్లో గౌరవం కూడా నేర్పించారు.. నీకు మీ స్కూల్లో నేర్పించి ఉండరు.. లేకపోతే నేర్చుకో.. అంటూ రాసుకొచ్చాడు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే అలా కామెంట్ చేసింది కూడా తేజ్ ఫ్యాన్‌. ఇక తేజ్ రిప్లైకి ఆ ఫ్యాన్ స్పందిస్తూ రిప్లై ఇవ్వట్లేదని అలా పెట్టా.. క్షమించు అన్న అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దానికి సదరు నెటిజ‌న్‌ స్పందిస్తూ రిప్లై ఇవ్వట్లేదని అలా పెట్టా క్షమించు అన్న అంటూ చెప్పుకొచ్చాడు.