మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?

డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం జరిగింది. అలాగే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటున్నట్లు సమాచారం.

సెన్సార్ రిపోర్టు ప్రకారం ఈ సినిమా పూర్తిగా A సర్టిఫికెట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 25 నిమిషాలు.. మంగళవారం సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగి ఒక మిస్టారికల్ థ్రిల్లర్ సినిమా అని ఊహించని విధంగా మలుపులు ఉంటాయని థియేటర్లో ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతారని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉన్నది.. వాస్తవానికి ఈ సినిమా 13 కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ ని అందుకోవడం గమనార్హం.

డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఈ సినిమా చివరి 45 నిమిషాలు క్రీస్తు రూపంలో అదిరిపోయేలా ఉంటుందని.. ఇక సెన్సార్ రిపోర్టు కూడా కాస్త పాజిటివ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బోల్డ్ అటెంప్ట్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా సక్సెస్ అయితే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ అజయ్ భూపతి తెలియజేయడం జరిగింది. మరి ఏ మేరకు పాయల్ ఈ సినిమాతో కలెక్షన్స్ సునామిని సృష్టిస్తుందో తెలియాలి అంటే 17 తేదీ వరకు ఆగాల్సిందే.