హీరోయిన్ అవ్వడం కోసం దీపికా పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.. ఐశ్వర్య రాయ్ తర్వాత మళ్లీ అంతటి పేరును సంపాదించుకున్న వారిలో ఈమె ఉంటుందని చెప్పవచ్చు.. నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అయితే ఇదంతా ప్రస్తుతం..కానీ ఒకప్పుడు దీపిక పదుకొనే అంటే ఏమిటి అనే విషయాలు ఎవరికీ తెలియదు వాటి గురించి తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ కావడం అంటే అది చాలా కష్టము.. తన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలను తెలియజేసింది దీపిక పదుకొనే.. తన కెరియర్ ప్రారంభంలోనే చేతిలో లగేజీ పట్టుకొని ముంబై ప్రాంతానికి వచ్చి చాలాసార్లు తిరిగేదాన్ని.. తన ముంబైకి వచ్చిన సమయంలో తనకు సిటీ అంటే పెద్దగా తెలియదు స్నేహితుడు కూడా ఎవరూ లేరు అవకాశాల కోసం చాలా కష్టాలను పడ్డాను.. ఉదయం వెళ్తే రాత్రి అయ్యే వరకు తిరుగుతూనే ఉండేదాన్ని చేతిలో ఒక సూట్ కేసు తనతో ఒక క్యాబ్ ఉండేది క్యాబ్ లోనే నిద్రపోయి ఇంటికి వెళ్లేదాన్ని తెలిపింది..

తమ తల్లిదండ్రులు కూడా క్షేమంగా ఉన్నానా లేదా అనే విషయం పైన చాలా బెంగగా ఉండేవారని.. ఓవర్ నైట్ కి ఎవరూ కూడా స్టార్డం కారు.. అందులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి అవకాశాలు అంటే అసలు ఇచ్చేవారు కాదని.. అలాంటి సమయంలో ఎన్నో రకరకాల కష్టాలను, సవాళ్లను సైతం ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొని ప్రస్తుతం వాటన్నిటిని అధిగమించి ఒక గొప్ప నటిగా ఉన్నారని తెలియజేసింది బాలీవుడ్లో ప్రస్తుతం ఈ అమ్మడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.