ఇటీవల చిరంజీవి ఇంట దీపావళి పండుగలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్ అంతా కూడా హాజరు కావడం జరిగింది. రామ్ చరణ్ ,ఉపాసన నిర్వహించిన ఈ ఫంక్షన్ లో వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,మహేష్ బాబు ఇలా అగ్ర హీరోలు అందరూ కూడా ఒకే చోట చేరి అభిమానులకు కనులు విందుగా చేయడం జరిగింది.
ప్రస్తుతం ఈ సెలబ్రేషన్ కి సంబంధించి కొన్ని రకాల ఫోటోలు వీడియోలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోలో చిరంజీవి షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలోని టైటిల్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కనిపించారు. చిరంజీవి డాన్స్ వేస్తూ ఉంటే రామ్ చరణ్ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తున్నది.
ఇక మెగా అభిమానులు కూడా ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తే షారుక్ ఖాన్ ట్యాగ్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి షారుక్ పాటకి చిరంజీవి వేసిన ఆ స్టెప్పుల వీడియో వైరల్ గా మారుతోంది.ఈ ఫంక్షన్ కి వచ్చిన సెలబ్రిటీల ఫోటోలను సైతం అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.. అంతేకాకుండా మహేష్ బాబు రామ్ చరణ్ ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని తెలియజేస్తూ అందరూ ఆశ్చర్యపడేలా చేస్తున్నారు.. స్క్రీన్ పగిలిపోయిన మొబైల్ ని వెంకటేష్ ఉపయోగించడం ఇలా పలు రకాల వాటిని అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.
#Chiranjeevi and #RamCharan on Jawan title track #SRK𓃵 🔥 pic.twitter.com/BcOMRkGw7P
— vikram era (@Siddd122) November 14, 2023