శ్రీలీల తెలుగులో చేయాల్సిన మొదటి సినిమా ఏంటో తెలుసా..? అది కూడా సూపర్ డూపర్ హిట్ మూవీనే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు .. మనం అనుకున్నది కచ్చితంగా జరగదు.. అది మాత్రం కన్ఫామ్ .. శ్రీ లీల కూడా అలాంటి పరిస్థితులను తట్టుకొని ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చింది . నిజానికి శ్రీ లీల ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సింది. అయితే కొంచెం లేట్ అయింది .

ఆమె చదువుల కారణంగా ఆమె వద్దకు వచ్చిన మంచి ఆఫర్ ని మిస్ చేసుకుంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నాగశౌర్య హీరోగా నటించిన సినిమా ఛలో. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా డైరెక్టర్ శ్రీలీలాను అనుకున్నారట. కానీ అప్పటికే ఆమెకు ఎగ్జామ్స్ ఉండడంతో ఆమె ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట.

ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఆమె కెరీర్ ఎలా మారిపోయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసిన శ్రీలీల జపమే చేస్తున్నారు హీరోలు..ఆమెను నెత్తి మీద పెట్టేసుకుంటున్నారు..!!