ఈ పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తిన్నారా అంతే..!!

మనం ప్రతిరోజు వంటింట్లో కచ్చితంగా ఏదైనా మిగిలిన వాటిని వేడి చేస్తూ తింటూ ఉంటాము.. అయితే ఇలా కొన్ని వాటిని తినడం వల్ల ఏమీ కాదు.. కానీ మరికొన్ని ఇలా వేడి చేసి తినడం వల్ల చాలా అనార్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా చికెన్ కూరను ఉదయం తయారు చేసిన తర్వాత రాత్రి సమయాలలో తినవచ్చు. కానీ మళ్ళీ రేపటి ఉదయానికి నిలువ ఉంచి వేరు చేసుకుని తినడం అనేది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందట.

బియ్యాన్ని ఉండినప్పుడు ఒకసారి మాత్రమే వేడి చేసి ఉడికిస్తే అది అన్నంగా మారుతుంది.అయితే నిల్వ ఉన్న ఆహారాన్ని వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందట. ఇందులో బ్యాక్టీరియా పేరుకు పోయే అవకాశం ఉంటుంది.

ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే వీటిని పదేపదే వేడు చేస్తే ఈ కూర కూడా చాలా విషయంగా మారుతుందట. ఇందులో బచ్చలి కూర కూడా ఒకటి. ఈ కూరను ప్రతిసారి వేడి చేస్తే నైట్రేట్ విడుదలయి క్యాన్సర్కు కారణం అవుతుంది.

బంగాళదుంపలతో చేసిన చిప్స్, కర్రీ ఫ్రై వాటిని పదేపదే వేడు చేస్తే ఇవి ఎక్కువగా విషాన్ని ఉత్పత్తి చేస్తాయట. దీనివల్ల కడుపునొప్పి వాంతులు విరేచనాలు వంటివి అవుతాయి.

చాలామంది వండుకొని తిన్న తర్వాత మిగిలిన వాటిని ఫ్రిజ్లో పెట్టుకొని తినడం చాలాకాలంగా కనిపిస్తున్న అలవాటు.. అయితే ఈ అలవాటుతో మిగిలిన వాటిని కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతూ ఉంటారు. అలా చల్లగా ఉన్న పదార్థాలను సైతం వేడిగా చేసి తినడం వల్ల చాలా ప్రమాదమట. ఇలా చల్లబడిన ఆహారాన్ని వేడి చేసుకుని తినడం వల్ల ఇందులో పోషక వెల్ఫేలు కోల్పోతాయి ఇది తినడం శరీరానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది.