స్టార్ హీరోలు అందరికి విలన్ గా తయారైన ఈ కమెడియన్..

సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే చాలామంది ఒక ప్రొఫెషన్‌లో సెట్ అవ్వాలని భావిస్తారు. కానీ వారు ఇంకొకటి అవుతారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా అడుగుపెట్టి హీరోలుగా మారిన వారు, హీరోలుగా అడుగుపెట్టి డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో సునీల్ ఒకరు. మొదట విలన్ గా అవ్వాలని ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా కమెడియన్ గా మారి కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో హీరోగా అడుగు వేసి బోర్ల పడ్డాడు.

ఇక తన తప్పుని తెలుసుకున్న సునీల్ మనకు హీరోయిజం సెట్ అవ్వదు అని తనలో ఉన్న స‌త్త‌ మరోసారి బయటకు తీశాడు. ఈసారి మొదటి చేసిన తప్పు చేయకుండా అటు కమెడియన్ గా కూడా కాకుండా విలన్‌గా మారాడు. పుష్ప మూవీలో సునీల్ విల‌న్ రోల్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒకప్పుడు ఏ ఫేస్ అయితే చూసి నవ్వే వాళ్ళు అదే ఫేస్ చూసి ఇప్పుడు భయపడే విధంగా సునీల్ మారాడు. తమిళ హీరోలకు విలన్ అనగానే సునీల్ ట‌క్కను గుర్తుకు వచ్చేంతగా ఆయన ఎదిగాడు. ఇంక తాజాగా మరో హీరోకు సునీల్ విలన్ గా మారనున్నాడు. టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీ హరోంహర.

జ్ఞాన సాగర్ డైరెక్షన్లో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై.. సుమంత్ జి నాయుడు ఏ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో సునీల్ విలన్ గా నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ మూవీలో సునీల్ పేరు పళాని స్వామి. పేరుకు తగ్గట్టే తమిళ్ తంబిలా కనిపిస్తున్నాడు. ఈ పిక్ లో సీరియస్‌లుక్‌తో కనిపించిన సునీల్ కు పక్కన గన్, బుల్లెట్స్ చూపించి మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా చేశారు. ఇక ఇప్పటికే విలన్ గా సత్తా చాటిన సునీల్ ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.